Friday, September 13, 2024

పార్శ్వనొప్పి(మైగ్రేన్) తట్టుకోవడం మహా కష్టం సుమా!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  పార్శ్వనొప్పి(మైగ్రేన్) అనేది ఓ రకమైన తలనొప్పి.  అది కణతలకు ఓ వైపే వస్తుంది. ఆ నొప్పిని భరించడం చాలా కష్టం. ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వారికే బాగా తెలుస్తుంది. ఇది తరచుగా వికారం, వాంతులు, కాంతి, ధ్వనికి సంబంధించి తీవ్ర సున్నితత్వంతో ఉంటుంది. మైగ్రేన్ గంటలపాలు లేక రోజులపాటు ఉండొచ్చు. ఈ పార్శ్వపునొప్పి మన రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంటుంది.

సకాలంలో డాక్టరును కలిసి మందులు వాడడం మంచిది. వీలైతే వెలుతురు లేని గదిలో ఎక్కువ సేపు ప్రశాంతంగా పడుకోడానికి ప్రయత్నించాలి. బాగా నీరు తాగాలి. సమయానికి తినడం, తాగడం, విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి.

మైగ్రేన్ పిల్లలను, టీనేజర్లను, పెద్దలను ఎవరినైనా బాధించొచ్చు. ఈ వ్యాధి నాలుగు దశలుగా వృద్ధి చెందుతుంది: అవి.. ప్రోడ్రోమ్, ప్రకాశం(ఆరా), దాడి(అటాక్), పోస్ట్-డ్రోమ్. మైగ్రేన్ వచ్చిన వారికి ఈ నాలుగు స్టేజ్ లు తప్పక ఉంటాయని కాదు.

ప్రొడ్రోమ్ లో మలబద్ధకత, మూడ్ మారడం, బాగా తినాలనిపించడం, మెడ పట్టేయడం, ఎక్కువగా మూత్రం రావడం, పదేపదే ఆవిలింతలు రావడం ఉంటాయి.

ఆరాలో చూపు ఇబ్బందిని ఎదుర్కొంటారు. కళ్ల చుట్టూ కాంతి వలయాలు(ఆరా) కనిపించొచ్చు. చూపు తగ్గొచ్చు. కాళ్లు చేతుల మీద సూదులు పొడుస్తున్నట్లు అనిపించవచ్చు. బలహీనత, మొద్దుబారినట్లనిపించడం ఉండొచ్చు. మాట్లాడటంలో కూడా ఇబ్బంది ఏర్పడవచ్చు.  నిమిషాలు మొదలుకొని గంటపాటు దీని ప్రభావం ఉంటుంది.

దాడి(అటాక్)  సాధారణంగా 4 నుంచి 72 గంటలపాలు ప్రభావం చూపుతుంది. మైగ్రేన్ ఒకవైపు కణతలో నొప్పి ఉండొచ్చు, ఒక్కోసారి రెండు కణతల్లోనూ నొప్పి రావొచ్చు. తల తిరగడం, వాంతులు కావడం జరగొచ్చు.

పోస్ట్-డ్రోమ్ లో చేవ తగ్గిపోయినట్లుగా ఉంటుంది. అయోమయంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ సకాలంలో డాక్టరును సంప్రదించి చికిత్స పొందితే మంచిది.

Migraine

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News