Saturday, July 27, 2024

‘ఆర్.ఆర్.ఆర్’లో గద్దర్ పాట?

- Advertisement -
- Advertisement -

Gaddar

 

ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటున్న ఈ భారీ మల్టీస్టారర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ ఓ పాట పాడబోతున్నారని సమాచారం. ఈ మేరకు ఇటీవల రాజమౌళి, గద్దర్ కలిసి చర్చించుకున్నారని తెలిసింది.

తెలంగాణకి చెందిన ప్రజా పోరాట వీరుడు కొమరం భీమ్ పాత్ర ఈ సినిమాలో ఉంది. ఆయనకు సంబంధించిన పలు పాటలను ఇప్పటికే గద్దర్ పాడడంతో ఆయనతోనే ‘ఆర్.ఆర్.ఆర్’లో ఓ పాట పాడిస్తే బాగుంటుందని రాజమౌళి ఓ నిర్ణయానికొచ్చారని సమాచారం. ఈ పాటను గద్దర్ రాసే అవకాశాలున్నట్టు కూడా తెలిసింది. ఇటీవలే గద్దర్ సోదరుడు నర్సింగ రావు మరణించాడు. ఆ విషాదం నుంచి ఆయన బయటికొచ్చాక ‘ఆర్.ఆర్.ఆర్’ పాట గురించి ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

Gaddar sing a song in RRR movie
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News