Wednesday, August 6, 2025

పవర్‌ఫుల్ రోల్‌లో అనుష్క.. ‘ఘాటి’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని సిల్వర్ స్క్రీన్‌ మీద చూసి చాలా కాలమైంది. చివరిగా ఆమె ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ అనే సినిమాలో కనిపించారు. ప్రస్తుతం ఆమె ‘ఘాటి’ (Ghaati) అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ చిత్రం మాదకద్రవ్యాల మాఫియా చుట్టు తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ట్రైలర్‌లో చూపించిన విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సాగర్ నాగవల్లి అందించిన మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. కాగా, ట్రైలర్‌లో ఈ ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన ఈ సినిమాను(Ghaati) విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలకానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News