Saturday, March 2, 2024

నేటి నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు శుభముహూర్తాలు

- Advertisement -
- Advertisement -

గతేడాది ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా దాదాపు 32 లక్షల వివాహాలు…. రూ. 3.75 లక్షల కోట్ల వ్యాపారం
ఈసారి 38 లక్షల వివాహాలు… రూ.4.15 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం
కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా

మనతెలంగాణ/హైదరాబాద్: డిసెంబర్ రెండోవారం వరకు మంచి ముహూర్తాలు ఉండడంతో శుభకార్యాలు, పెళ్లిళ్లు చేసుకోవడానికి ప్రజలు సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దానికి తగ్గట్టుగా పనుల్లో నిమగ్నమయ్యారు. దీపావళి అనంతరం నేటి నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయ్యింది. దీంతో వివాహాల సమయంలో రికార్డు స్థాయిలో బిజినెస్ జరగనుందని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఏఐటి) అంచనా వేస్తుంది. గతేడాది ఇదే కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 32 లక్షల వివాహాలు జరగ్గా, రూ. 3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది.

కాగా, ఈ సంవత్సరం ఈ నెలలో వరుసగా 23,24,27,28, 29 తేదీల్లో శుభప్రదమైన తేదీలు దీంతోపాటు డిసెంబర్‌లో 3,4,7,8,9, 15 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లతో పాటు గృహ ప్రవేశాలు తదితర కార్యక్రమాలను జరుపుకోవడానికి ప్రజలు సమాయత్తం అవుతున్నారు. ఈ సీజన్‌లో మొత్తం 11 మంచి ముహూర్తాలు ఉండగా దేశవ్యాప్తంగా దాదాపు 38 లక్షల వివాహాలతో పాటు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందని, దీనివల్ల రూ.4.15 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని సిఏఐటి అంచనా వేస్తోంది.

సిఏఐటి అంచనా ప్రకారం దాదాపు 7 లక్షల వివాహాలు (రూ. 3 లక్షల ఖర్చుతో), సుమారు 8 లక్షల వివాహాలు (రూ. 6 లక్షల ఖర్చుతో), 10 లక్షల వివాహాలు (రూ. 10 లక్షల ఖర్చుతో), సుమారు 7 లక్షల వివాహాలు (రూ. 15 లక్షల ఖర్చును), దాదాపు 5 లక్షల వివాహాలు (రూ. 25 లక్షల ఖర్చును), సుమారు 50 వేల పెళ్లిళ్లు ( రూ.50 లక్షల ఖర్చును) మరో 50 వేల పెళ్లిళ్లు (రూ.కోటి పైచిలుకు ఖర్చు) చేయడానికి ఏర్పాట్లు చేయడానికి సిద్ధఅయ్యాయని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News