Thursday, May 2, 2024

“ఉపాధి” హామీ పథకం డిమాండ్‌కు కేంద్రం నిరుత్సాహం : కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పారదర్శకం పేరుతో బలవంతంగా డిజిటలైజేషన్ పద్ధతిని ప్రవేశ పెట్టి ఉపాధి హామీ పథకం డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం నిరుత్సాహ పరుస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. గత ఆరునెలలుగా ఈ ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించలేదని వెలువడిన మీడియా కథనాన్ని ఉదహరిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కేంద్రంపై తన ఎక్స్ పోస్ట్ ద్వారా ధ్వజమెత్తారు. గత ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య ఆరు నెలల కాలంలో వాహనాల విక్రయంలో 48 శాతం సుమోటో వాహనాలు ఉండగా, మరోవైపు అదే సమయంలో 60,000 కోట్ల కేటాయింపు ఉపాధి పథకానికి బడ్జెట్‌లో కేటాయించకపోవడాన్ని కేంద్రం నిరుత్సాహ పర్చడమేనని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాన్ని బాధించడమే కాక, అసమానతను నిరూపిస్తోందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News