Friday, May 3, 2024

ఉద్యోగుల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలి

- Advertisement -
- Advertisement -

1,72,000 కుటుంబాలు సిపిఎస్‌తో మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి
ప్రభుత్వం సిపిఎస్‌ను రద్దు చేసి ఉద్యోగులకు మేలు చేయాలి
సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ

మన తెలంగాణ/హైదరాబాద్:  పందోమ్మిది సంవత్సరాలుగా 1,72,000 కుటుంబాలు సిపిఎస్ విధానంతో ఇబ్బందులకు గురవుతున్నాయని ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం అర్ధం చేసుకొని దక్షిణ భారతదేశంలోనే సిపిఎస్‌ను రద్దు చేసి తొలి రాష్ట్రంగా నిలవాలని సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ విజ్ఞప్తి చేశారు. 11 రోజులుగా ‘సిపిఎస్ రద్దు పాత పెన్షన్ సాధన ’ కోసం జూలై 16వ తేదీన గద్వాల జిల్లా జోగులాంబ అలంపూర్‌లో మొదలైన పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర గురువారం మెదక్‌కు చేరుకుంది.

వీరికి ఆహ్వానం పలుకుతూ జిల్లా అధ్యక్షుడు ఎల్లం, జిల్లా కోశాధికారి చంద్రం, రాష్ట్ర నాయకులు దేవయ్య, మల్లికార్జున్ తదితరులు స్థిత ప్రజ్ఞను,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్‌లను పూలమాల, శాలువాతో ఆహ్వానం పలికారు. అనంతరం ద్వారక గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ ప్రస్తుతం సిపిఎస్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్‌లు పెరుగుతున్నాయపి ఇప్పటికైనా ప్రభుత్వం సిపిఎస్ రద్దుకు నడుం బిగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే భారతదేశంలోని ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలు పాత పెన్షన్ అమలు చేస్తున్నాయని ఆయన తెలిపారు. కర్ణాటకలో రాబోయే బడ్జెట్ సమావేశాల్లో పాత పెన్షన్ అమలు విధానం అమలు చేస్తామని ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. ఆగస్టు 12వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా సిపిఎస్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చరణ్ సింగ్, నరేందర్, కృష్ణ, పద్మారావు, రాజ్ గోపాల్ గౌడ్, లక్ష్మణ్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News