Sunday, April 28, 2024

కల్లాలో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

- Advertisement -
- Advertisement -

ములుగు: కల్లాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఏఐసిసి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని రాఘవపట్నం గ్రామంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్ ఆధ్వర్యంలో కల్లాల్లోని ధాన్యాన్ని ఏఐసిసి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సరైన సమయానికి కొనే నాథుడు లేక అన్నదాతలు లబోదిబో మంటున్నారన్నారు. అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులకు కనీసం నష్టపరిహారం ఇవ్వకుండా పంట ఇన్సురెన్స్ డబ్బులు కూడా దోచుకుతింటూ, రైతున్నను చావు దెబ్బ తీస్తున్నారని అన్నారు.

పంట పెట్టుబడికి అప్పులు చేసి పంట పండిస్తే చివరికి ఆ పంటను అమ్ముకునే సమయంలో సరైన సమయానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం భద్రపరుచుకోవడానికి సరైన వసతులు కల్పించక, తరుగు పేరుతో రైతును దగా చేస్తున్న మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయకుండా అకాల వర్షాలతో అతలాకుతలం అవుతున్న రైతుకు ఆపన్నహస్తం అందించకుండా ధాన్యం రవాణా చేయడానికి వాహనాలు కాంట్రాక్టు ఒకరికే ఇస్తూ ధాన్యం సరఫరా చేయకుండా ఇసుక రవాణా చేస్తూ వాహనాల చట్టు రైతులు కాళ్లరిగేలా తిరిగిన కూడా కనికరించకుండా రైతన్నల దగ్గర అదనపు డబ్బులు తీసుకుంటు దగా చేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు దశాబ్ది ఉత్సవాలలో పాల్గొంటూ రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని అన్నారు.

వెంటనే కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యంపు బస్తాలను వాహనాలను సమకూర్చి తరలించాలని, తరలించిన ధాన్యం యొక్క డబ్బులు రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని, వచ్చే ఖరీఫ్ సీజన్ దగ్గరగా ఉండడం వలన పంట పెట్టుబడి కోసం వెంటనే పంట రుణాలు రైతన్నకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చింత క్రాంతి, కోరం రామ్మోహన్, ఈక శేషు, వంశీ, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News