Thursday, May 2, 2024

కూకట్‌పల్లిలో ఘనంగా ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

కేపీహెచ్‌బి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం అధ్యాత్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని దేవాలయాలు, చర్చీలు, మజీద్‌లలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు కార్పొరేటర్లు మందాడి శ్రీనివాస్‌రావు, పగుడాల శిరీషా బాబూరావు, సబియాగౌసుద్దీన్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ నాయకత్వంలో అన్ని మతాలు, కులాలు కలిసి అందరూ అన్నదమ్ముల్లా ప్రశాంతమైన వాతవరణంలో జీవిస్తున్నామని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని మతాలు దేవాలయాల అభివృద్ధ్దికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారని,

యాదాద్రి దేవాలయం గత ప్రభుత్వాలు ఎంత నిర్లక్షం చేశాయో చూశామని, నేడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి యాదాద్రిని దర్శించుకోవడానికి వస్తున్నారంటే సిఎం కెసిఆర్ చేసి కృషి ఎంతటితో అర్ధమవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చీలు, మజీదులు, గురుద్వారాలు వంటి దేవాలయాలకు నిధులు కేటాయిస్తూ అన్ని మతాల పండుగలకు వారి వారి సాంప్రదాయానికి అనుగుణంగా దుస్తులు అందిస్తూ ప్రోత్సాహకాలు అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News