Wednesday, August 6, 2025

బిసి ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని ప్రారంభించిన గ్రాన్యూల్స్ ఇండియా

- Advertisement -
- Advertisement -

అనకాపల్లి: హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, పరవాడలో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన బీసీ ప్రభుత్వ బాలుర వసతి గృహం ను ప్రారంభించింది. తద్వారా, బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లల విద్యా వసతులను మెరుగుపరచడం పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. అనకాపల్లి మరియు విశాఖపట్నం జిల్లాలకు చెందిన పలు గ్రామాలలోని పేద కుటుంబాలకు చెందిన 100 మందికి పైగా విద్యార్థులకు ఈ కార్యక్రమం ప్రయోజనం చేకూరుస్తుంది, తమ విద్యను కొనసాగించడానికి వారికి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా (ఆంధ్రప్రదేశ్) కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి విజయ కృష్ణన్, ఐఏఎస్, మరియు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఉమా చిగురుపాటి, ఇతర కీలక ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. వసతి గృహంలో నివసిస్తున్న 9 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు, ఇప్పుడు వారి అభ్యాస ప్రయాణానికి మద్దతు ఇచ్చే రీతిలో శుభ్రమైన, సురక్షితమైన, గౌరవప్రదమైన నివాస ప్రాంగణాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా, లక్ష్య కేంద్రీకృత విద్యా అనుభవాన్ని పెంపొందించటానికి విద్యార్థులకు స్కూల్ బ్యాగులు , పుస్తకాలతో కూడిన కిట్‌లను పంపిణీ చేశారు. “ప్రతి చిన్నారి, వారు ఎక్కడి నుండి వచ్చినప్పటికీ నేర్చుకోవడానికి, ఎదగడానికి, తమ కలలు సాకారం చేసుకోవటానికి అర్హులు.

గ్రాన్యూల్స్‌ వద్ద, మేము సమ్మిళిత పురోగతికి విద్య అత్యంత కీలకమని భావిస్తున్నాము. ఈ వసతి గృహంలో మెరుగైన సదుపాయాలను కల్పించటం ద్వారా, విద్యాపరమైన దృష్టి , ఆత్మవిశ్వాసం రెండింటినీ పెంపొందించే సురక్షితమైన, గౌరవప్రదమైన ప్రాంగణాన్ని మేము సృష్టించాము. ఆరోగ్యకరమైన, మరింత సాధికారత కలిగిన సమాజాలను నిర్మించాలనే మా ప్రయత్నంలో ఈ కార్యక్రమం చిన్నదే అయినప్పటికీ అర్థవంతమైన ముందడుగు” అని గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఉమా చిగురుపాటి అన్నారు.

ఈ పరివర్తన ప్రాజెక్ట్ క్లిష్టమైన మౌలిక సదుపాయాల సవాళ్లను పరిష్కరించింది. వసతి గృహంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి విస్తృత స్థాయిలో మరమ్మతులను చేపట్టింది. ఈ పునరుద్ధరించబడిన వసతి గృహం ఇప్పుడు పరిశుభ్రమైన వాష్‌రూమ్‌లు, తగినంత నిల్వ సౌకర్యాలతో పూర్తిగా పనిచేసే వంటగది, శుభ్రమైన బోర్డింగ్ గదులను కలిగి ఉంది, ఇది పిల్లలకు ఇంటి నుండి దూరంగా ఉన్నప్పటికీ సౌకర్యవంతమైన, సహాయక జీవన వాతావరణాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమం, తాము సేవలందించే సమాజాలలో స్థిరమైన ప్రభావాన్ని చూపే గ్రాన్యూల్స్ ఇండియా విస్తృత సీఎస్ఆర్ లక్ష్యంను ప్రతిబింబిస్తుంది. విద్య, నైపుణ్యం, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు దాని సామాజిక బాధ్యత కార్యక్రమంలో అత్యంత కీలకంగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News