Thursday, May 2, 2024

ఉపాధి హామీ కూలీ పడదు… పైకం జమ కాదు

- Advertisement -
- Advertisement -
  • పనులు లేక ఉపాధి పనికొస్తున్నాం
  • పేదల పథకంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం
  • వ్యకాస నేత నాగేశ్వరరావు

కారేపల్లి : ఉపాధీ హామీ పనిలో కూలి పడటం లేదని, చేసిన పనికి పైకం ఖాతాల్లో జమ కావటం లేదనీ ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం కారేపల్లి మండలంలోని కారేపల్లి, ఉసిరికాయలపల్లి గ్రామాల్లో ఉపాధి పనుల వద్ద వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శ్రమ ఎక్కువ కూలీ తక్కువగా ఉపాధి పనుల్లో వస్తుందని కూలీలు తెలిపారు.

ఎంత పడుతుందో పేస్లిప్పులు లేవనీ, పైకం ఎప్పుడు పడుతుందో తెలియటం లేదన్నారు. పని ముట్లు ఇవ్వటం, పనిముట్ల పదును పెట్టటానికి ఇచ్చే పైకం మరిచిపోయారని వ్యకాస బృందానికి కూలీలు తెలిపారు. కూలీ పడని పనికి రెండు పూటలు పని చేయాలంటా, పనులు లేక బ్రతుకు దెరువు కోసం ఉపాధి పనికి వస్తున్నామని పేదలు ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా వ్యకాస జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ పేదలకు ఉపాధీ చూపే ఈజీఎస్‌పై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.

పనులు కల్పించక, కూలీ పైకం ఇవ్వకుండా ఈజీఎస్‌ను పేదలకు దూరం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. దీనిని పేదలందరూ తిప్పికొట్టాలని, వ్యకాస ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం రక్షణ పోరాటాల్లో పాలు పంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉసిరికాయలపల్లి సర్పంచ్ బానోత్ బన్సీలాల్, వ్యకాస నాయకులు తేజావత్ చందర్, వెంకన్న, బద్దె రాధమ్మ, కూలీలు పెద్దమ్మ సత్యనారాయణ, వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News