Friday, May 3, 2024

సత్తా చాటిన గురుకులాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గిరిజన గురుకుల విద్యార్థులు 92.76 శాతం ఉత్తీర్ణతతో సత్తా చాటారు. పదో తరగతి పరీక్షకు మొత్తం 6,383 మంది విద్యార్థులకు గాను 5,921 మంది ఉత్తీర్ణులయ్యారు. 21 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి. 10 మంది విద్యార్థులు 10 సిజిపిఎ సాధించారు. 10 సిజిపిఎ సాధించిన వారిలో భైంసా గిరిజన గురుకులానికి చెందిన ఆర్.స్వప్న, ఎస్.శృతి, ఇ.శివాని, మానూర్ గురుకులానికి చెందిన సిహెచ్ దేవి, జె అక్ష, జె.సిరీష, కంగ్తి గురుకులానికి చెందిన వి. అనిల్ రావు, కె.సతీష్ ఖమ్మం గురుకులానికి చెందిన బి.సతీష్, తిరుమలాయెపాలెం గురుకులానికి చెందిన బి. మోహన్, వైరా గురుకులానికి చెందిన విజయలక్ష్మి, కొండాపూర్‌కు చెందిన కె.ప్రకాశ్, నాగిరెడ్డి పేటకు చెందిన డి. కైలాష్, దామర్చర్లకు చెందిన ఎ.అనూష, మిర్యాలగూడ గురుకులానికి చెందిన ఎం వైష్ణవి, పెద్ద వూరాకు చెందిన ఆర్.సాయికుమార్, నారాయణఖేడ్‌కు చెందిన వి. మహిపాల్‌లు 10 సి జిపిఎ సాధించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి 77.67 శాతం విద్యార్థులు పదోతరగతిలో ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 8,254 మంది విద్యార్థులకు గాను 6,411 మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మంత్రి సత్యవతి రాథోడ్, గిరిజన సంక్షేమ కార్యదర్శి, క్రిస్టినా జెడ్ చోంగ్తు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News