- Advertisement -
హైదరాబాద్: కెఎ పాల్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడంటూ కెఎ పాల్ పై ఓ యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నైట్ షిఫ్ట్‌లో పని చేస్తున్నప్పుడు తనని అసభ్యకరంగా తాకాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. వాట్సాప్‌లోనూ అసభ్యకర మెసేజ్‌లు పంపాడంటూ స్క్రీన్‌షాట్స్ అందజేయడంతో పాటు ఆధారాలతో షీ-టీమ్‌ని ఆమె సంప్రదించింది. యువతి ఇచ్చిన ఆధారాలతో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. గత 15 రోజులుగా బాధితురాలు అమెరికన్ కో-ఆర్డినేటర్‌గా కెఎ పాల్ వద్ద పని చేస్తున్నారు.
- Advertisement -