Thursday, May 2, 2024

సెంటిమెంట్ల ఓట్లతో కడుపు నిండదు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao Bhoomi Puja for Peddamma Temple in Huzurabad

కరీంనగర్: హుజూరాబాద్ పట్టణంలోనీ రంగనాయకుల గుట్ట వద్ద పాటిమిది ఆంజనేయ స్వామి జ్ఞాన సరస్వతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్దమ్మ గుడి నిర్మాణానికి మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, టీఆరెఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ”పెద్దమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. వచ్చే అరు నెలల్లో గుడి నిర్మాణాన్ని పూర్తి చేసుకొని బోనాలు సమర్పించుకుదాం. ఇక్కడ ఇన్ని దేవాలయాలు ఉన్నా, రోడ్డు ఉండకపోవడం సరైంది కాదు. చిలుక వాగు బ్రిడ్జి కోసం కోటి రూపాయలు మంజూరు చేసినం. టీఆరెఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. రూ.30 లక్షల రూపాయలతో దేవాలయాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుతం. గతంలో ఉన్న మంత్రి ఒక్క డబుల్ బెడ్ రూం కూడా కట్టలేదు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కెసిఅర్ నాలుగు వేల ఇండ్లు ఇచ్చినా ఒక్క ఇల్లు కట్టలేదు. స్థలం ఉన్న వారికి డబ్బులు ఇచ్చి ఇల్లు క్కట్టించే బాధ్యత తీసుకుంట. ఒక్క ఇల్లు కట్టని ఈటల రాజేందర్ కు ఓటు వేస్తే ఎలా అభివృద్ది చేస్తాడు. అభివృద్ది కావాలంటే గేల్లు శ్రీనివాస్ కు ఓటు వేసి గెలిపించండి. బిజెపి పార్టీ.. నెల నెలకు గ్యాస్ ధర పెంచి సబ్సిడీ తగ్గిస్తుంది. నిత్యావసర ధరలు పెంచి పేద ప్రజల మీద భారం వేస్తుంది. ధరలు పెంచే బిజెపి కావాలా పేద ప్రజలను అదుకునే టీఆరెఎస్ కావాలా అలోచించండి. ఇంకా రెండేళ్లు టీఆరెఎస్ అధికారంలో ఉంటుంది. కరోనా సమయంలో పేద ప్రజలను అదుకున్నం. సెంటిమెంట్ల ఓట్లతో కడుపు నిండదు. పని చేసే వాళ్ళను ఆదరించాలి” అని కోరారు.

Harish Rao Bhoomi Puja for Peddamma Temple in Huzurabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News