Friday, June 20, 2025

కెసిఆర్ జీవితమంతా నీటి కోసమే పోరాడారు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తన జీవితమంతా నీటి కోసమే పోరాడారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నీటి కేటాయింపులు, బనకచర్ల ప్రాజెక్టు గురించి నిన్న సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ బనకచర్లకు నీళ్ళు తీసుకెళ్ళమని చెప్పారని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడని మండిపడ్డారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సారాంశంలో ఉన్న అంశాలను సగం సగం చదివి ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తెలంగాణ ప్రభుత్వానికి తెలియకుండా ఒక్క టీఎంసీ కూడా తీసుకోవద్దని కెసిఆర్ అడ్డుకున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం చేసి ఉంటే ఆయనకు నీటి విలువ తెలిసి ఉండేదని ఎద్దేవా చేశారు. కృష్ణా ట్రైబ్యునల్‌ ముందు కెసిఆర్‌ ఎంతో పోరాటం చేశారన్నారు. కృష్ణా ట్రైబ్యునల్‌ ముందు 750 టీఎంసీల నీరు రావాలని పోరాడామని.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ చేసిన పాపం వల్ల కృష్ణాలో 220 టీఎంసీలే తెలంగాణకు వచ్చాయని హరీష్ రావు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News