Thursday, May 2, 2024

కాళేశ్వరం ఖర్చే రూ.80వేల కోట్లు.. రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది..?

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుడు వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో బుధవారం జిల్లా రైతులకు స్ప్రింక్లర్స్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “రాహుల్ గాంధీ వచ్చి కాళేశ్వరం రూ.లక్ష కోట్ల అవినీతి అన్నడు.. ఖర్చు పెట్టింది రూ.80 వేల కోట్లు అంటే, అవినీతి ఎక్కడిది. కాంగ్రెస్ హయాంలో ఒక్క చెరువు బాగు చేశారా?..నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ వాళ్లది నోరా.. మోరా?. రంగనాయక సాగర్ లో ముంచి లేవడితే నీళ్ళు ఉన్నవి, లేనిది తెలుస్తది కావొచ్చు. కాళేశ్వరం పూర్తి చేశాం కాబట్టే భూమికి బరువైన పంట పండుతున్నది. కాళేశ్వరం పని కానిదే ఈ ఘనత సాధ్యం అయ్యిందా?” అని ప్రశ్నించారు.

Also Read: ప్రియాంక చోప్రా వీడియోపై నెటిజన్ల ఫైర్ (వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News