Sunday, September 21, 2025

వరద బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వం విఫలం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరద బాధితులకు సాయం అందించడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. రాంగోపాల్ పేట్‌లోని వరద ప్రాంతాల్లో హరీష్ రావు పర్యటించారు. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో వరదముంపుకు గురైన 1500 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి ఆయన హోదాను తగ్గించే విధంగా ఉందని, వరద బాధితులకు ఆర్థిక సాయం, నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. నాలాల పూడిక తీత పనులు వెంటనే చేపట్టాలన్నారు.

Also Read: అక్కడి జంగ్ సైరన్ ఇక్కడా మోగుతుందా?

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల అంశంపై కూడా ఆయన స్పందించారు. బహిరంగంగా పార్టీ కండువా మార్చుకుని పార్టీ మారడంలేదనడం సిగ్గుచేటు అని చురకలంటించారు. పార్టీ మారమని మారిన నేతలు చెబుతున్నారని, మారలేదని రేవంత్ చెప్పడం సరికాదన్నారు. తెలంగాణ దసరా, బతుకుమ్మ పండుగులను ప్రజలు అంగరంగా వైభవంగా జరుపుకుంటున్నారని, బతుకమ్మ పండుగకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. పండుగ పూట గ్రామాల్లో చెత్త ఎత్తడానికి, ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి డబ్బులు లేవన్నారు.

వానాకాలానికి ముందు నాలాలన్నీ క్లీన్ చేయాలని, గతంలో కెసిఆర్ నాయకత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్ హైదరాబాద్ నగరంలో నాలాలన్నీ క్లీన్ చేయించేవారని, రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ బస్తీలను పట్టించుకోవడం లేదని, నాలాలు క్లీన్ చేయకపోవడం వల్ల నాలాల నుండి వరద చ్చిందన్నారు. ఈ వరదలతో ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు కూడా కొట్టుకుపోయాయని, తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని, రేవంత్ ప్రభుత్వం ఒక్క రూపాయి సహాయం కూడా వరద బాధితులకు చేయలేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరంలో 8 మంది నాలాల్లో కొట్టుకుపోయి చనిపోయారని, ఆ చావులకు కారణం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కాదా? అని హరీష్ రావు ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News