Tuesday, April 30, 2024

ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయ ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అదేవిదంగా పారుపల్లి వీధిలో గల పాత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వైభవంగా జరుగుతుందని, ఈ పర్వదినంనా ఉత్తర ద్వారా దర్శనం ప్రత్యేకత అని అన్నారు. స్వామి దయతో రాష్ట్ర ప్రజలు అందరు సుఖసంతోషాలతో వర్ధిల్లాలన్నారు. దేశం, రాష్ట్రంలో కరోనా లాంటి మహమ్మారిలు ప్రభలకుండా చూడాలని ప్రార్థించారు. ప్రజలందరూ ఈ పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలన్నారు. ఈ సందర్బంగా స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.

ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి హరీష్ రావుకి ఆశీర్వాదం ఇచ్చారు. స్థానిక గణేష్ నగర్ శ్రీ ప్రసన్నంజనేయ స్వామి ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన తూర్పు ద్వారాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం ఆలయం లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు హరీష్ రావుని సన్మానించారు. ఆలయ అభివృద్ధి పనులు, షెడ్ నిర్మాణ పనుల ఫై సంతృప్తి వ్యక్తం చేసారు. ఆలయంలో మిగిలిన పనులు పూర్తి చేసి కొద్దీ రోజుల్లోనే ప్రారంభం చేసుకుందామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News