నోయిడా: భారతదేశంలో అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీ HCLTech యొక్క కార్పొరేట్ సామాజిక బాధ్యతా ఎజెండాను HCLFoundation ప్రోత్సహిస్తుంది. సంస్థ ఇప్పుడు HCLTech గ్రాంట్ యొక్క 2025 ఎడిషన్ యొక్క విజేతలను ప్రకటించింది. విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు పర్యావరణంలో పరివర్తనాపరమైన మార్పును ప్రోత్సహించే నాన్-గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ (NGOలు)ను HCLTech గ్రాంట్ మద్దతు చేస్తుంది. ఈ ఏడాది, HCLTech గ్రాంట్ భారతదేశంవ్యాప్తంగా ఉన్న NGOల నుండి 13,925 రిజిస్ట్రేషన్స్ ను స్వీకరించింది. ప్రతి శ్రేణిలో నుండి మూడు విజేత NGOలకు తమ ప్రభావితపరిచే ప్రాజెక్టుల కోసం రూ. 5 కోట్లు ($580,700) మరియు ప్రతి శ్రేణిలో ఆరు రన్నర్-అప్ NGOలకు రూ. 25 లక్షలు ($29,000) బహుకరించబడ్డాయి.
ఈ రోజు వరకు, HCL ఫౌండేషన్ అత్యంత ప్రభావితపరిచే ప్రాజెక్టుల స్థాయికి చేరడానికి HCLTech గ్రాంట్ కార్యక్రమం ద్వారా రూ. 152.8 కోట్లు (~$18.4మిలియన్లు) మంజూరు చేసింది. తమ 10వ ఎడిషన్ లో, HCLTech గ్రాంట్ 22 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 142 ప్రాజెక్టులలో 59 ప్రాజెక్టులను మద్దతు చేసింది.
HCLTech గ్రాంట్ 10వ ఎడిషన్ లో గెలిచిన NGOలు:
· పర్యావరణం: పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ మరియు ఉత్తర 24 పరగణాలలోని 40 గ్రామాలలో సుస్థిరమైన వ్యవసాయం ప్రోత్సహించడం, స్థానిక జీవనోపాధులు మద్దతు చేయడం మరియు మహిళలకు సాధికారిత కల్పించే తమ ప్రాజెక్టు “జీవితం మరియు జీవనోపాధి కోసం జీవ వైవిధ్యత సంరక్షణ” కోసం లోకమాత రాణి రషమోణి మిషన్ కృషి చేసింది.
· ఆరోగ్యం: తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ లలోని 10,000 గ్రామాల్లో రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ (ROP) వలన బాల్యంలో కలిగే అంధత్వం నిర్మూలించడం పై దృష్టిసారించే “విజన్ ఆఫ్ వీల్స్” ప్రాజెక్ట్ కోసం గురుప్రియ విజన్ రీసెర్చ్ ఫౌండేషన్ కృషి చేసింది.
· విద్య: దేశవ్యాప్తంగా 38,400 గ్రామాల్లో స్పర్శనీయమైన వ్యవస్థలు ద్వారా విద్యను చేర్చడానికి దృష్టిసారించే “టచ్ లెర్న్ అండ్ షైన్” ప్రాజెక్టు కోసం రైజ్డ్ లైన్స్ ఫౌండేషన్ కృషి చేసింది.
ఆరు-రన్నర్ అప్ NOGలు:
· పర్యావరణం: లైఫ్ ఎడ్యుకేషన్ అండ్ డవలప్ మెంట్ సపోర్ట్ (LEADS) మరియు గ్రామ్ గౌరవ్ ప్రతిష్టాన్
· ఆరోగ్యం: PRO RURAL మరియు పల్లియమ్ ఇండియా ట్రస్ట్
· విద్య: 17000 అడుగుల ఫౌండేషన్ మరియు యువ ఇండియా ట్రస్ట్
“అట్టడుగు స్థాయిల్లో మార్పులను ప్రోత్సహించడానికి, సేవలు అందని సమాజాల అవసరాలను పరిష్కరించడానికి మరియు సుస్థిరాభివృద్ధిని పోషించడానికి NGOలు కీలకమైన బాధ్యతవహిస్తాయి. వారి అంకితభావం మరియు నిరంతర ప్రయత్నాలు జీవితాలను మార్చడంలో సహాయపడతాయి, అవకాశాలు కల్పిస్తాయి మరియు సమర్థవంతమన సమాజాలను రూపొందిస్తాయి. HCL ఫౌండేషన్ లో మేము ఈ గొప్ప సంస్థలకు మద్దతు ఇవ్వడానికి, తమ ప్రభావాన్ని విస్తరించడానికి మరియు దీర్ఘకాలం మార్పును కల్పించడానికి వారికి సాధికారత ఇవ్వడానికి మేము హక్కును కలిగి ఉన్నాము. అర్థవంతమైన మరియు కొలవదగిన ఫలితాలను అందించడంలో NGOల సామర్థ్యాన్ని శక్తివంతం చేయడానికి మరియు ఆవిష్కరణ పరిష్కారాలను పోషించడానికి HCL టెక్ గ్రాంట్ వంటి కార్యక్రమాలు ద్వారా, మేము నిబద్ధతను కలిగి ఉన్నామని”, శ్రీమతి రాబిన్ అబ్రమ్స్, ఛైర్ పర్శన్, HCL టెక్ గ్రాంట్ జ్యూరీ (భారతదేశం మరియు అమెరికా) మరియు HCLTech మాజీ బోర్డ్ సభ్యురాలు అన్నారు.
జ్యూరీలోని ఇతర విశిష్ట సభ్యులలో రోషిణి నాడర్ మల్హోత్ర, ఛైర్ పర్శన్, HCLTech; పల్లవి ష్రోఫ్, మేనేజింగ్ పార్ట్ నర్, షర్దుల్ అమర్ చంద్ మరియు మంగళదాస్ & కో; బి.ఎస్. బాస్వన్, మాజీ డైరెక్టర్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు మాజీ HRD కార్యదర్శి; డాక్టర్. రిచర్డ్ లరివీర్, సంస్కృత పండితుడు & ప్రెసిడెంట్ ఎమరైటస్, ద ఫీల్డ్ మ్యూజియమ్, చికాగో మరియు సురేషన్ నారాయణన్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, నెస్లే ఇండియా లిమిటెడ్.
“ఈ ఏడాది HCLTech గ్రాంట్ 10వ ఎడిషన్ కు గుర్తుగా నిలిచింది. అట్టడుగు స్థాయిలో గణనీయమైన తేడాను చూపించిన NGOల ప్రభావవంతమైన పనిని ఈ మైలురాయి చూపించింది. మేము ఈ సంస్థలకు మద్దతునివ్వడాన్ని గౌరవంగా భావిస్తాము. ఎందుకంటే అవి సేవలు అందని, సుదూర ప్రాంతాల్లో ఉండే వారిలో సుస్థిరమైన మార్పును ప్రోత్సహిస్తున్నాయి. గెలిచిన ప్రతి NGO మార్పు యొక్క కొలవదగిన మరియు అనుకరించదగిన నమూనాల ద్వారా కొలవదగిన ప్రభావాన్ని సృష్టించదగిన మా నిబద్ధతకు ఉదాహరణగా నిలిచింది. ఈ సంబరం వ్యూహాత్మకమైన CSR మరియు జాతి నిర్మాణంలో HCLTech వారి నాయకత్వాన్ని సూచిస్తోంది,” అని డాక్టర్ నిధి పంధీర్, SVP, గ్లోబల్ CSR, HCLTech & డైరెక్టర్, HCL ఫౌండేషన్ అన్నారు.
HCLTech గ్రాంట్ – ల్యాండ్ ఫిల్స్ నుండి 31,306 టన్నుల వ్యర్థాలను మళ్లించడం, 23,703 మందికి ఆసుపత్రులలో ప్రసవాలు కల్పించడం మరియు ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ డవలప్ మెంట్ స్కీమ్ ద్వారా 39,286 మందికి ప్రయోజనం కలిగించడం ద్వారా గణనీయంగా అభివృద్ధి చెందిన సుస్థిరాభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది. ఈ కార్యక్రమం 245 జలాశయాలను పునరుద్ధరణ చేసింది మరియు పరోక్ష విధానాలు ద్వారా 128,102 హెక్టార్ల భూమికి నీటిని అందించింది. 67,095 టన్నుల (CO₂కి సమానమైనది) కార్బన్ ఉద్గారాలను తగ్గించింది, 2,722 టన్నుల వ్యర్థాలను సుస్థిరంగా నిర్వహించింది మరియు రీసైకిల్ చేసింది మరియు పునరుత్పాదక వ్యవసాయంలో 74,183 మహిళా రైతులకు శిక్షణనిచ్చింది. ఇంకా, గ్రాంట్లు ద్వారా నిధులు సమకూర్చబడిన కార్యక్రమాల ద్వారా 177,080 చెట్లను నాటింది.