Friday, May 3, 2024

పేదల కోసమే ఆరోగ్య సేవలు విస్తృతం

- Advertisement -
- Advertisement -

పెబ్బేరు : పేదల ఆరోగ్య సంక్షేమమే ప్రభుత్వ లక్షమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు పురపాలక పరిధిలోని శ్రీ సరోజిని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ సేవలను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. పెబ్బేరు పట్టణంలో కార్పొరేట్‌ను తలపించే రీతిలో ఆసుపత్రి నిర్మాణం చేశారని, ఆర్థోపెడిక్, ఇతర విభాగాలలో ఇప్పటికే మంచి గుర్తింపు పొందారని అన్నారు.

పేదలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆసుపత్రిలో ఉచితంగా ఆరోగ్య శ్రీ, డయాలసిస్ సేవలు లభిస్తాయన్నారు. ప్రభుత్వం ఆరోగ్యపరంగా రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు సేవలు అందించాలని లక్షాన్ని నెరవేరుస్తుందని, ఆ దిశలోనే కంటి వెలుగు, కెసిఆర్ కిట్లు, జిల్లా కేంద్రాలలో ప్రస్తూతి కేంద్రాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. వైద్య పరంగా చేసే సేవలు సామాజిక సేవకు సమానమన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తిరుపతి రావు, హాస్పిటల్ డైరెక్టర్ లావణ్య రంగారెడ్డి, మార్కెట్ మాజీ చైర్మెన్ గౌని బుచ్చారెడ్డి, చైర్మెన్ గౌని కోదండ రాంరెడ్డి, వైద్య నిపుణులు భరత్ కుమార్ రెడ్డి, సాయి శ్రీ, మాజీ జెడ్పి చైర్మెన్ బండారి ప్రకాష్, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కరుణ శ్రీ సాయినాథ్, జెడ్పిటిసి పెద్దింటి పద్మా వెంకటేష్, వైస్ చైర్మెన్ కర్రె స్వామి, కౌన్సిలర్లు మేకల సుమతి ఎల్లయ్య, మండల పార్టీ అధ్యక్షులు వనం రాములు, మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు, తహసిల్దార్ అబ్రహం లింకన్, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News