శేరిలింగంపల్లిలో అత్యధికంగా12.6సెం.మీ వర్షపాతం నమోదు
రోడ్లన్నీ జలమయం ఫ్లైఓవర్‌లపై ట్రాఫిక్
జామ్ కిలోమీటర్ ప్రయాణానికి
3 గంటలకు పైగా సమయం పలు
ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు
అంతరాయం అప్రమత్తమైన జిహెచ్‌ఎంసి,
మనతెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీవర్షం దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వర్షం కారణంగా నగరంలోని రోడ్లన్నీ జలాశయాలుగా మారాయి. రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచాయి. శేరిలింగంపల్లిలో 12.6 సెం.మీ.లు. గచ్చిబౌలిలో 12.5 సెం.మీ.లు. ఖాజాగూడలో 12 సెంటీ మీటర్లు, శ్రీనగర్‌కాలనీలో11.3 సెం.మీ.లు, సరూర్‌నగర్‌లో 11.30 సెం.మీ.లు. ఖైరతాబాద్‌లో 11.1 సెం.మీ.లు. ఎస్సార్ నగర్‌లో 11సెం.మీ.లు. వర్షపాతం న మోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, షేక్‌పేట్, మణికొండ, హై టెక్ సిటీలో వాన జోరుగా కురుసింది. ఐటీ కా రిడార్‌లో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు రోడ్లపైకి రావొద్దని, లోతట్టు ప్రాంతాల వై పు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. చాదర్‌ఘాట్ నుండి ఎల్బీనగర్ వర కు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఖైరతాబాద్ నుండి పంజాగుట్ట, ఖైరతాబాద్ జూబ్లీహిల్స్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్‌సిటీ, ఐకియా, బ యోడైవర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాం తాల్లో వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్‌సమస్య తలెత్తి గంటకు ఒక కిలోమీటరుగా కదిలాయి.
పోలీసులు, హైడ్రా టీంలు, జీహెచ్‌ఎంసి సిబ్బంది వర్షం తీసుకొచ్చిన ఇబ్బందులను నివారిస్తున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 12 వెంగళరావు బిల్డింగ్ వద్ద విద్యుత్ స్తంభం కూలిపోయింది. గురువారం రాత్రంత వర్షం కురిసే అవకాశముందన్న అలర్ట్ రావటంతో జీహెచ్‌ఎంసీ, పోలీసు, హైడ్రా, జలమండలి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు రంగంలోకి దిగాయి. హైడ్రా, జలమండలి టీమ్ లు వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీటిని తోడేసే విధుల్లో నిమగ్నమయ్యాయి. నిపుణల అలర్ట్ ప్రకారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఓ జల్లు కురిసిన వర్షం, సాయంత్రం ఆరు గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై సిటీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దాదాపు గంట సేపు వర్షం దంచికొట్టడంతో నిత్యం రద్దీగా ఉండే లక్డీకాపూల్, ఖైరతాబాద్, నాంపల్లి, పంజాగుట్ట, అమీర్ పేట, బేగంపేట, ఎస్.ఆర్.నగర్, బోరబండ, సికిందరాబాద్, చార్మినార్, దోమల్ గూడ, నారాయణగూడ, ఉప్పల్, అంబర్ పేట, రాజేంద్రనగర్, మణికొండ, రాయదుర్గం, శంషాబాద్, కాచిగూడ, హిమయత్‌నగర్ ప్రాంతాలతో గాలిదుమా రంతో వర్షం కురిసింది.
అమీర్ పేట, బోరబండ ప్రాంతాల్లోని పలు భవనాల సెల్లార్లలోకి వర్షపు నీరు ప్రవహించి, పార్కింగ్ చేసిన వాహానాలు నీట మునిగాయి. ఖైరతాబాద్, అమీర్ పేట మైత్రి వనం చౌరస్తాలు చిన్న పాటి చెరువులను తలపించాయి. మెహిదీపట్నం నుంచి లింగంపల్లి వరకు, సికిందరాబాద్ నుంచి హైటెక్ సిటీ వరకు ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిల్చిపోయింది. తెలుగు తల్లి, బేగంపేట, మాసాబ్ ట్యాం క్ ఫ్లై ఓవర్లపై వాహానాలు ఎక్కడికక్కడే జామ్ అయ్యాయి. హైదరాబాద్ నగరంలో గురువారం కురిసిన భారీ వర్షం కారణంగా సహాయక చర్యలపై జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్‌ఎంసీ, హైడ్రా, జలమండలి, పోలీసు శాఖతో సమీక్ష నిర్వహించారు. సిటీలో ఇప్పటికే గుర్తించిన మొత్తం 141 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద ఎక్కడా కూడా నీరు నిల్వగుండా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు: బల్దియా కమిషనర్
గురువారం రాత్రి నుంచి రెండు రోజుల పాటు నగరానికి వర్షసూచన ఉండటంతో అత్యవసరమైతే తప్పా, నగరవాసులు బయటకు రావద్దని బల్దియా కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సూచించారు. జీహెచ్‌ఎంసీ కొత్తగా నియమించుకున్న నిపుణుల హెచ్చరికలు పారదర్శకంగా ఉన్నాయని, వాటినే హైడ్రా కు పంపి, హైడ్రా ద్వారా నగరవాసులకు సమాచారాన్ని చేరవేస్తున్నట్లు ఆయన వివరించారు.