Tuesday, April 30, 2024

రాగల మూడు రోజులు వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు తూర్పు దక్షిణ జిల్లాల్లో ఉరుములు మెరుపులు గంటకు 50కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ ద్రోణి విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నట్టు వాతవారణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌తోపాటు చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38నుంచి 41డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News