Thursday, September 25, 2025

నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

ఉత్తర మధ్య బంగాళాఖాతంలో గురువారం ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది పశ్చిమ దిశగా కదులుతూ 26వ తేదీన వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రధేశ్ తీరాలకు అనుకుని వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వాయుగుండం ఈనెల 27వ తేదీ నాటికి దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రధేశ్ తీరాలను దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురంభీం ఆసాఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,

నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లొ అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు 26వ తేదీ నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. దీంతో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు అరెంజ్, ఎల్లో అలర్ట్‌తో వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News