Thursday, October 10, 2024

హైదరాబాద్ కు మరోసారి కుంభవృష్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో మరోసారి కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే ఆల్వాల్, కొంపల్లి, కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరి కాసేపట్లో నగరమంతా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపివంది. సాయంత్రం, రాత్రి కూడా వర్షం పడనుండనున్నట్లు తెలిపింది. కరీంనగర్, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్ లలో కూడా భారీ వర్షం కురియనున్నది.

మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వలన దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర వాయువ్య భాగంలో అల్పపీడనం ఏర్పడింది. దీనివలన రాగల నాలుగు రోజుల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండి) పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News