Saturday, May 31, 2025

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగండ్లతో భారీ వర్షం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పలు చోట్ల వర్షం కురుస్తోంది. మరికొన్ని చోట్ల వడగండ్లు పడుతున్నాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల్, వనపర్తి, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక, రాబోయే మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయన హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే, నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని.. ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ కేంద్రం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News