Saturday, August 9, 2025

రాష్ట్రంలో భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

క్యుములోనింబస్ మేఘాలు, బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాచ్చే వారం మొత్తం వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు క్యుములోనింబస్ మేఘాలతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదులుగాలులు వీస్తాయని ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటుగా మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని 21 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

కాగా, 13వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 13, 14,15 తేదీలలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. వారం రోజుల పాటు వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా, రాష్ట్రంలో శనివారం రాత్రి 8 గంటల వరకు వనపర్తి జిల్లాలోని గోపాల్ పేటలో అత్యధికంగా 103.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా హయాత్‌నగర్‌లో 75.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిలాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెపుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News