Saturday, July 27, 2024

మే 23 వరకు భారీ వానలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వాతావరణంలో మార్పు వచ్చింది. ఎండ తీవ్రత, వడగాల్పులు తగ్గాయి. ఈ నెలలో ఇప్పటికే వానలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతీ రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు తెలిపింది. మే 19 నాటికి బంగాళాఖాతంలో నైరుతీ రుతుపవనాలలు విస్తరిస్తాయని పేర్కొంది. మే 24 నాటికి అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ధ్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిమీ. ఎత్తున ఈ ఉపరితల ధ్రోణి ఆవరించి ఉంది. ఈ కారణంగా మే 23 తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఓ మోస్తరు నుంచి భారీ వానలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News