Wednesday, May 1, 2024

సిఐసి చీఫ్ కమిషనర్‌గా సమారియా ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్( సిఐసి) చీఫ్ కమిషనర్‌గా హీరాలాల్ సమారియా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.ఆయనతో రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. అక్టోబర్ 3న వైకె సిన్హా పదవీ విరమణ చేసినప్పటినుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. కేంద్ర సమాచార కమిషన్( సిఐసి) ప్రధాన కమిషనర్‌గా నియమితులైన తొలి దళితుడు సమారియా.1985 బ్యాచ్ తెలంగాణ కేడర్ ఐఎఎస్ అధికారి అయిన సమారియా కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖలో పని చేస్తూ రిటైర్ అయ్యారు.

2020నవంబర్ 7న కేంద్ర సమాచార కమిషనర్‌గా ప్రమాణం చేశారు. సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్‌గా సమారియా ప్రమాణ స్వీకారం చేయడంతో ఎనిమిది మంది కమిషర్లు ఉండే కమిషన్‌లో ఒక పోస్టు ఖాళీగా ఉంది. సిఐసి లో ఖాళీలతో పాటుగాప్రధాన కమిషనర్ పోస్టును భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ పోస్టును భర్తీ చేయడానికి కేంద్రం చర్యలు తీసుకొంది. సిఐపి ప్రధాన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేంద్ర సమాచార కమిషనర్లుగా ఆనంది రామలింగం, వినోద్ కుమార్ తివారీలతో ఆయన ప్రమాణం చేయించారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News