Monday, June 10, 2024

స్టైలిష్‌గా గోపీచంద్

- Advertisement -
- Advertisement -

Hero gopichand act in pakka commercial movie

 

యాక్షన్ హీరో గోపీచంద్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. కమర్షియల్ పంథాలో సాగే కామెడీ ఎంటర్‌టైనర్‌గా మారుతి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ఇందులో గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన సరసన గ్లామరస్ క్వీన్ రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె ఓ సీరియల్ స్టార్‌గా కనిపించనుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. శనివారం హీరో గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. చిత్ర బృందం ఓ సర్‌ప్రైజింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో కళ్ళద్దాలు పెట్టుకొని గోపీచంద్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఇది ఓ సాంగ్‌లోని స్టిల్ అని అర్థమవుతోంది. ఇప్పటి వరకు మాస్ గెటప్స్‌తో అలరించిన మ్యాచో స్టార్ గోపీచంద్.. ఈసారి ‘పక్కా కమర్షియల్’లో సరికొత్త లుక్‌లో మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. ‘పక్కా కమర్షియల్’ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్లపై రూపొందుతోంది. బన్నీ వాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇంతకుముందు ఈ సినిమాను అక్టోబర్ 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు కానీ కరోనా పరిస్థితులను బట్టి సినిమా రిలీజ్ ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News