Wednesday, May 15, 2024

పోలీస్ అధికారిగా రాశీ

- Advertisement -
- Advertisement -

‘ది ఫ్యామిలీమ్యాన్ 2’ వెబ్ సిరీస్ బాగా క్లిక్ అయింది. దాంతో ఇప్పుడు అందరి చూపు అటువైపు పడింది. అలాగే ఈ సిరీస్‌లో రాజీ అనే పాత్రలో సమంత అదరగొట్టింది. ఈ నేపథ్యంలో త్వరలోనే మొదలు కానున్న హిందీ వెబ్ సిరీస్‌లో రాశీ ఖన్నా నటించనుందట. అజయ్ దేవగణ్ హీరోగా రూపొందనున్న ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్‌ని బీబీసీ స్టూడియో నిర్మించనుంది. ‘లూథర్’ అనే ఇంటెర్నేషనల్ వెబ్ సిరీస్‌కి ఇది రీమేక్. అజయ్ దేవగన్ పోలీస్ ఆఫీసర్‌గా నటించే ఈ సిరీస్‌లో హీరోయిన్‌గా రాశీ ఖన్నాని సెలెక్ట్ చేశారు. ఆమె కూడా పోలీస్ అధికారిగానే కనిపించనుంది. మొత్తానికి రాశీ ఖన్నా కూడా హీరోయిన్‌గా బిజీ అవుతోంది. ఆమె ప్రస్తుతం నాగచైతన్య సరసన ‘థాంక్యూ’ సినిమాలో నటిస్తోంది. అలాగే కార్తీ సరసన ‘సర్దార్’ అనే మూవీ కూడా చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News