Tuesday, May 7, 2024

మేడారానికి ప్రత్యేక బస్సులు.. టికెట్ ఛార్జీలు ఎలా ఉన్నాయంటే..?

- Advertisement -
- Advertisement -

ములుగు: మేడారం జాతరకు పెద్ద ఎత్తు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు మేడారానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో మేడారం పరిసరాలు వాహనాలతో నిండిపోయాయి. ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాల పార్కింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేశారు. సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఈరోజు దాదాపు 3 లక్షల మంది భక్తులు మేడారానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు వచ్చే మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు.

తెలంగాణ రాష్ట్రంలోతోపాటు చుట్టూ ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మేడారంకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. శనివారం మేడారంలో తాత్కాలిక బస్ స్టాండ్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. మేడారం వెళ్లే వారిలో పెద్దలకు రూ.370, పిల్లలకు రూ.210 ఛార్జ్‌ చేస్తున్నారు. ఈ మహాజాతరకు మొత్తం 280 ప్రత్యేక బస్సులను రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News