Saturday, September 20, 2025

పటాన్‌చెరులో భారీగా గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. ఆ ముఠాలు సరఫరా మాత్రం ఆపడం లేదు. పోలీసుల కళ్లు కప్పి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరోసారి పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు ఇక్రిశాట్ సమీపంలో ఎస్ఓటీ, రామచంద్రపురం పోలీసులు దాదాపు 160 కిలోల గంజాయిని పట్టుకున్నారు. శనివారం తనిఖీలు చేపట్టగా.. ఒడిశా నుంచి ముంబైకి తరలిస్తున్న గంజాయిని గుర్తించి స్వాధీనం చేసకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News