Sunday, May 11, 2025

సికింద్రాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: నగరంలో నిత్యం ఎక్కడో ఒక చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుల నుంచి రూ. 1.50 లక్షల విలువైన గంజాయి.. నాలుగు సెల్ ఫోన్లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి సికింద్రాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News