Saturday, July 27, 2024

ఎయిర్ ఇండియా సిఇఒ పదవిని తిరస్కరించిన ఇల్కర్

- Advertisement -
- Advertisement -

Ilker rejects Air India CEO post

 

న్యూఢిల్లీ : టాటా గ్రూప్ సొంతం చేసుకున్న ఎయిర్ ఇండియాకు సిఇఒ(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా ఇల్కర్ ఐసిని నియమించాలనుకోగా, ఇప్పుడు ఈ ఆఫర్‌ను ఆయన నిరాకరించారు. ఇల్కర్ నియామకాన్ని ప్రకటించిన తర్వాత భారతదేశంలో నిరసనలు చెలరేగాయని, దీంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని టాటా ప్రతినిధి ధృవీకరించారు. ఐసి నియామకాన్ని భారత మీడియాలోని కొన్ని వర్గాలు తప్పుగా అర్థం చేసుకున్నాయని, దీంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చారని తెలిపారు. పాకిస్తాన్ మిత్రదేశమైన టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌కు ఇల్కర్ సన్నిహితుడంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.

దీనికి గాను ఇల్కర్ స్పందించారు. ‘భారత మీడియాలోని కొన్ని వర్గాలు తప్పుగా అర్ధం చేసుకున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ పదవిని అంగీకరించడం గౌరవప్రదమైన నిర్ణయం కాదనే నిర్ణయానికి వచ్చాను’ అని ఇల్కర్ తెలిపారు. ఎయిర్ ఇండియా కొత్త ఎండి, సిఇఒ గా ఇల్కార్ ఐసిని టాటా గ్రూప్ ఎంపిక చేసింది. 2022 ఏప్రిల్ 1 నుండి ఇల్కర్ బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా, ఆయన నియామకంపై వివాదం మొదలైంది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌కు ఇల్కర్ సన్నిహితుడని మీడియా కథనాలు వచ్చాయి. అయితే కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎర్డోగాన్ చాలాసార్లు లేవనెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విషయం చాలా సున్నితంగా మారింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News