Tuesday, April 30, 2024

దళారుల లాభార్జన కొరకై భూస్వాములపై అక్రమ దాడులు

- Advertisement -
- Advertisement -

దంతాలపల్లి : మండలంలోని బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన ఎంపిటిసి అనుమాండ్ల రమణా రెడ్డి మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హల్‌లో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నా స్వంత పట్టా భూమి మీదకు కోంత మంది దళారుల లాభార్జన కోరకై బానోతు హచ్యా కుటుంబికులను ఉసిగోల్పితే మా లాంటి భూస్వాముల భూముల దగ్గరకు వచ్చి నాపై నాకుటుంభ సభ్యులపై అక్రమంగా దాడులు చేస్తున్నారన్నారు.

బానోతు హాచ్యా మాకు 1977 వ సంవత్సరంలో అతని భూమిని మాకు అమ్మటం జరిగింది అప్పటి నుండి ఈ రోజు వరకు ఆ యొక్క భూమికి సంబందిచిన తోక పాస్‌బుక్, పట్టాపాస్‌బుక్,13 భీలు, పహాణీలు, ఆ భూమికి కట్టిన రకం పన్నుల రశీధులు కూడ ఉన్నాయన్నారు. మానోతు హాచ్చా మరణించిన ఆనంతరం తన కుటింబికులు తగాదాలకు దిగుతూ 2019 వ సంవత్సరంలో ఆ విషయంపై తహశీల్దార్ దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది అలాగే 2020 వ సంవత్సరంలో ఆర్డివోతో మా భూములను ఆక్రమంగా లాక్కోని అనుమాండ్ల పూలమ్మ పేరుపై పట్టాలు చేసుకున్నారని వినతి పత్రాలు ఇవ్వగా మా దగ్గర ఉన్న డాక్యూమేట్లను వారు ఇరువురు పరిశీలించి ఆ భూమి అనుమాండ్ల పూలమ్మకే చెందుతుందని ఇచ్చిన డాక్యూమేట్లు కూడా మా దగ్గర ఉన్నాయని ఆయన తెలియజేశారు.

అదేవిధంగా హాచ్చా కుటింబికుల దగ్గర అట్టి భూమి వారిదేనని డాక్యూమేంట్ రూపంలో సరైన ఆధారాలుంటే నేను ఆభూమిని వదులుకోవడానికైన, చట్టపరంగా ఏశిక్షకైన నేను నా కుటింబికులు సిద్దంగా ఉన్నామన్నారు. ఇకనైన సంబందిత అధికారులు స్పందించి దళారులు తమ స్వంత లాభార్జన కోరకై ఆ కుటుంబానికి మాయమాటలు చేప్పిన కిషన్ నాయక్, గిరి నాయక్‌లపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సమావేశ సాక్షిగా తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ వలాద్రీ మల్లారెడ్డి, బీరిశేట్టిగూడెం గ్రామ సర్పంచ్ గుగులోతు నేహ్రునాయక్, కడుదుల మధుకర్ రెడ్డి, నాగిరెడ్డి వెంకట్ రెడ్డి, నారయణ రెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News