Friday, May 3, 2024

సింగిల్ డోస్ టీకాతో ఎలుకలో ఇమ్యూనిటీ

- Advertisement -
- Advertisement -

Immunity in mice with a single dose vaccine

 

న్యూఢిల్లీ : ఎలుకలో కొవిడ్19 కు వ్యతిరేకంగా వ్యాధినిరోధక శక్తిని సింగిల్ డోస్ టీకా పెంపొందించుతుందని శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. చిన్న నానోపార్టికల్స్ కలిగిన వ్యాక్సిన్ కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్లతో నిండి ఉండగా, ఈ నానోపార్టికల్ వ్యాక్సిన్లు వైరల్ ఆధార వ్యాక్సిన్ల ప్రభావాన్ని భద్రతతో తులనాత్మకం చేస్తాయని, ప్రొటీన్ వ్యాక్సిన్ల ఉత్పత్తిని సులువు చేస్తాయని పరిశోధకులు వివరించారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్ అడుగుభాగం దగ్గర కొంత భాగాన్ని పరిశోధకులు తొలగించారు. ఫెర్రిటిన్ తాలూకు నానోపార్టికల్స్‌ను అక్కడ చేర్చారు. ఫెర్రిటిన్ అన్నది ఐరన్ కలిగిన ప్రొటీన్. ఎలుకలో ప్రయోగం సందర్భంగా శాస్త్రవేత్తలు స్వల్పకాల స్పైక్ నానోపార్టికల్స్‌ను ఇతర బలమైన నానోపార్టికల్స్‌తో పోల్చి చూశారు. సమర్థమైన ఈ వాక్సిన్ల ప్రభావాన్ని భద్రంగా ఉన్న కల్పిత కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేయడాన్ని గమనించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News