Wednesday, September 24, 2025

ఆరంభం అదిరినా.. చివర్లో తడబడిన భారత్.. బంగ్లా టార్గెట్ ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

ఆసియా కప్ 2025 సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లో తడబడింది. దీంతో భారత్, బంగ్లాదేశ్ కు 169 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు.. ఓపెనర్లు అభిషేక్ శర్మ(75), గిల్(29)లు మరోసారి అదిరే ఆరంభాన్ని అందించారు. ఇద్దరు బంగ్లా బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే, దూకుడుగా ఆడే క్రమంలో భారీ షాట్ కు యత్నించి గిల్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబే(2) కూడా ఔటయ్యాడు. మరో ఎండ్ లో అభిషేక్ మాత్రం భారీ షాట్లతో చెలరేగి అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో అభిషేక్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(5)లు ఔట్ కావడంతో భారత్ ఒత్తిడిలో పడింది. అక్కడి నుంచి బంగ్లా బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో టీమిండియా బ్యాట్స్ మెన్లను అడ్డుకున్నారు. దీంతో మొదటి 10 ఓవర్లలో 100 పరుగులు సాధించిన భారత్.. తర్వాత 10 ఓవర్లలో కేవలం 68 పరుగులే చేసింది. చివరలో హార్దిక్ పాండ్యా(38 నాటౌట్) దూకుడుగా ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషాద్ హుస్సేన్ రెండు వికెట్లు పడగొట్టగా… ముస్తాఫిజుర్, తస్కిన్ అహ్మద్, సైఫుద్దీన్ తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News