Monday, May 5, 2025

ఆఖరి వరకూ ఉత్కంఠ.. శ్రీలంక చేతిలో ఓడిన భారత్

- Advertisement -
- Advertisement -

కొలంబో: శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో భారత్ మహిళల జట్టు విజయ యాత్రకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. అతిధ్య శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన తొలి ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్‌లో రిచా ఘోష్ 58, జెమీమా రోడ్రిగ్స్ 37, ప్రతీకా రావల్ 35 పరుగులు చేశారు.

ఆ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక దూకుడుగానే బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నా.. పరుగు రాబట్టింది. శ్రీలంక బ్యాటింగ్‌లో నీలాక్షి డి సెల్వా 56, హర్షిత సమరవిక్రమ 53, కవిషా దిల్హరి 35, విశ్మి గుణరత్నే 33 పరుగులు చేశారు. ఆఖరి ఓవర్‌ వరకూ ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చివరికి ఐదు బంతులు మిగిలి ఉండగా.. శ్రీలంక ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన నీలాక్షికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News