- Advertisement -
న్యూఢిల్లీ : భారత్ ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) త్వరలోనే అమలులోకి వస్తుంది. ఈ మేరకు ప్రకటన వెలువడుతుంది. అధికార వర్గాలు శనివారం ఈ విషయం వెల్లడించాయి. ఇప్పుడు ఈ ఒప్పంద అరబీ ప్రతిని ఒమన్‌లో రూపొందిస్తున్నారు. ఆ తరువాత ఉభయదేశాల మంత్రి మండలి సమావేశాలలో దీనిని ఆమోదించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఒప్పందం ఖరారు తరువాతి ప్రకటనపై ఇరు దేశాల ఉన్నత నాయకత్వాలు అంగీకారానికి వచ్చాయి. ఇక ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందనేది త్వరలోనే తెలుస్తుందని అధికారులు వివరించారు. రెండు మూడు నెలలోపే ఒప్పందం వెలువడుతుందని తెలిపారు.
- Advertisement -