Tuesday, November 12, 2024

భారత మహిళల ఘన విజయం

- Advertisement -
- Advertisement -

న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిడియా 44.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన న్యూజిలాండ్ 40.4 ఓవర్లలో 168 పరుగులకే కుప్పకూలింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ మహిళా టీమ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. సమష్టిగా రాణిస్తూ ప్రత్యర్థి టీమ్‌ను కుప్పకూల్చారు. రాధా యాదవ్ 3 వికెట్లను పడగొట్టింది.

సైమా ఠాకూర్‌కు రెండు వికెట్లు దక్కాయి. కివీస్ బ్యాటర్లలో బ్రూక్ హాలిడే (39), మాడి గ్రీన్ (31), జార్బియా (25), లౌరెన్ (26), అమెలియా కెర్ 25(నాటౌట్) మాత్రమే రాణించారు. మిగతా వారు విఫలం కావడంతో కివీస్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను దీప్తి శర్మ (41), తేజల్ (42) ఆదుకున్నారు. ఓపెనర్ షఫాలీ వర్మ (33), యస్తికా భాటియా (37), జెమీమా రోడ్రిగ్స్ (35) పరుగులు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో అమెలియా నాలుగు, జెస్ కెర్ మూడు వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News