Thursday, May 2, 2024

136కే కుప్పకూలిన ఇంగ్లండ్

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో ఆతిథ్య భారత మహిళా క్రికెట్ జట్టు పట్టుబిగించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 428 పరుగులకు ఆలౌటైంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్‌ను 35.3 ఓవర్లలో కేవలం 136 పరుగులకే భారత బౌలర్లు కుప్పకూల్చారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు షఫాలీ వర్మ (33), స్మృతి మంధాన (26) పరుగులు చేశారు. జెమీమా రోడ్రిగ్స్ (27), దీప్తి శర్మ (20) పరుగులు సాధించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ (44), పూజా వస్త్రాకర్ (17) పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో భారత్ ఆధిక్యం ఇప్పటికే 478 పరుగులకు చేరింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 104.3 ఓవర్లలో 428 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో లౌరెన్ బెల్, ఎక్లెస్టోన్ మూడేసి వికెట్లను పడగొట్టారు.

దీప్తి మ్యాజిక్..
కాగా, తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు డంక్లె (11), బ్యూమౌంట్ (10), కెప్టెన్ హీథర్ నైట్ (11) విఫలమయ్యారు. డానిల్లె వ్యాట్ (19), అమీ జోన్స్ (12) పరుగులు చేశారు. కీలక సమయంలో భారత స్పిన్నర్ దీప్తి చెలరేగి పోయింది. ఇంగ్లండ్ బ్యాటర్లను హడలెత్తించిన దీప్తి 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లను పడగొట్టింది. వ్యాట్, జోన్స్, ఎక్లెస్టోన్, కేట్ క్రాస్, లౌరెన్ ఫిల్లర్ వికెట్లను దీప్తి తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో సివర్ ఒక్కటే ఒంటరి పోరాటం చేసింది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సివర్ 10 ఫోర్లతో వేగంగా 59 పరుగులు సాధించింది. మిగతావారు విఫలం కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 136 పరుగులకే పరిమితమైంది. అయితే ఇంగ్లండ్‌ను ఫాలోఆన్ ఆడించే ఛాన్స్ ఉన్నా టీమిండియా బ్యాటింగ్ కొనసాగించేందుకే మొగ్గు చూపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News