Wednesday, May 1, 2024

ఓయూ వేదికగా ఇండియా స్టార్టప్ ఫెస్ట్ నిర్వహణ: విసి రవీందర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఇండియా స్టార్టప్ ఫెస్ట్ 2024 నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవీందర్ తెలిపారు. రిజిస్ట్రార్ ఆచార్య పి. లక్ష్మీనారాయణ, ఓయూ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ దేవరకొండ, టై గ్రాడ్ ఛైర్మన్ భానుప్రకాశ్, సాఫ్ట్ వేర్ టెక్నాలజీస్ పారక్స్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ జె. ఎ. చౌదరి ఆధ్వర్యంలో సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. బలమైన స్టార్టప్ వాతావరణాన్ని పెంపొందించడానికి, ఈ ప్రాంతంలో నిధులు, మార్గదర్శకత్వాన్ని సులభతరం చేయడానికి, ఇండియా స్టార్ట్  అప్ ఫౌండేషన్, ఉస్మానియా ఫౌండేషన్ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి.

స్టార్టప్ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, వక్తలు, సలహాదారులు, పెట్టుబడిదారులు ఒకే వేదికను పంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణతో పాటు భారత్ నలుమూలల నుంచి స్టార్టప్ కంపెనీలు పాల్గొనే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఉస్మానియా ఫౌండేషన్, ఇండియా స్టార్టప్ ఫౌండేషన్ సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ఉపయోగపడతాయని నిర్వాహకులు చెప్పారు. డాక్టర్ జెఏ చౌదరి భాగస్వామ్యం పట్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొపెసర్లు ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్ జెఏ చౌదరి బెంగుళూరు, హైదరాబాద్, చెన్నైలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ పారక్స్ ఆఫ్ ఇండియాని స్థాపించారు. హైదరాబాద్, సైబరాబాద్ ఐటి పర్యావరణ వ్యవస్థల అభివృద్ధిలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. పోర్టల్ ప్లేయర్ సభ్యులలో ఒకరని ఇది యాపిల్ ఐపాడ్ కోసం సెంట్రల్ సిలికాన్ చిప్‌ను రూపొందించటం, రూపకల్పన చేయడానికి బాధ్యత వహిస్తుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News