Thursday, May 2, 2024

భళా.. భవీనా పటేల్

- Advertisement -
- Advertisement -

India secured medal in Paralympic TT

పారాలింపిక్స్ టిటిలో భారత్‌కు పతకం ఖాయం

టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. మహిళల టిటి సింగిల్స్ విభాగంలో భవీనా పటేల్ సంచలనం సృష్టించింది. పారాలింపిక్స్ టిటిలో సెమీస్‌కు చేరిన తొలి భారత ప్యాడ్లర్‌గా భవీనా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల క్లాస్4 సింగిల్స్‌లో భవీనా పటేల్ సెమీఫైనల్‌కు చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఖరారైన తొలి పతకం ఇదే కావడం విశేషం. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భవీనా పటేల్ రియో పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత రాంకోవిక్ (సెర్బియా)పై సంచలన విజయం సాధించింది. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన భవీనా 18 నిమిషాల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. అద్భుత ఆటతో అలరించిన భవీనా 115, 116, 117తో జయకేతనం ఎగుర వేసింది. ఇదిలావుండగా సెమీస్‌కు చేరడం ద్వారా భవీనా కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. పారాలింపిక్స్ నిబంధనల ప్రకారం టిటిలో సెమీస్‌కు చేరిన క్రీడాకారులకు కనీసం కాంస్య పతకాన్ని అందజేయడం అనవాయితీగా వస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News