Thursday, May 2, 2024

ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు

- Advertisement -
- Advertisement -
విదేశాల్లో కిష్ట పరిస్థితులను ఎదుర్కొన ప్రజలను ఆదుకున్నాం
ఆస్ట్రేలియా భారత రాయబారిగా పనిచేసిన ఏ. గీతేష్‌శర్మ వెల్లడి

హైదరాబాద్:  ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఆస్ట్రేలియాలో భారత రాయబారిగా పనిచేసిన అంబాసిడర్ ఎ. గీతేష్ శర్మ ప్రశంసించారు. జీ 20 యూనివర్శిటీ కనెక్ట్ లెక్చర్ సిరీస్ లో భాగంగా ఎంగేజింగ్ యంగ్ మైండ్స్ అనే అంశంపై శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయ దూరవిద్యాకేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విదేశాలతో భారత సంబంధాల ఆవశ్యకతను వివరిస్తూ ఉక్రెయిన్, సుడాన్ సహా అనేక ప్రాంతాల్లో క్లిష్టపరిస్థితులు ఎదురైన సందర్భాల్లో భారత పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు భారత విదేశీ వ్యవహారాల విభాగం అత్యుత్తమంగా పనిచేసిందని వెల్లడించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ దండెబోయిన రవీందర్ యాదవ్ నేతృత్వంలో ప్రగతి దిశగా అడుగులు వేస్తోందని అభినందించారు. కాలానుగుణంగా విదేశీ సంబంధాలు, దౌత్య విధానాలు మారుతూ వచ్చాయని సాంకేతిక యుగంలో ప్రపంచం మరింత ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. సంఘర్షలు లేని ప్రపంచాన్ని స్వప్నించే ప్రతి దేశం భారత్ వైపు చూస్తోందని పపంచానికి శాంతిని అందించటంలో నాయకత్వం వహించేది భారత్ మాత్రమేనని వివరించారు. హైదరాబాద్ నుంచి మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎడగటం, ఉస్మానియా విద్యార్థి శంతనునారాయణ్ అడాబ్ సీఈఓగా ఉండటం గర్వించదగినదని తెలిపారు.

ఓయూ జి-20 యూనివర్శిటీ కనెక్ట్‌కు వేదికగా ఎంపిక చేసిన ఆర్‌ఎస్‌ఐ అధికారులకు ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఓయూలో పరిశోధన, విద్యా కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పాఠ్య ప్రణాళిక సంస్కరణలపై వివరించారు. అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరిచేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇండో-పసిఫిక్ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. అనంతరం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ వి. ప్రవీణ్ రావు ప్రసంగిస్తూ దేశ ప్రజలకు అవసరమైన ఆహార ఉత్పత్తిలో సాధికారత సాధించామని స్పష్టం చేశారు. దేశంలోని పరిశోధనల ఫలితంగా వెనకబడిన దేశాలకు సైతం ఆహారాన్ని అందించే స్థాయికి ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఇతర హక్కులతో పాటు, ‘భూమి హక్కు‘, ‘ఆహార హక్కు‘ చట్టాలు చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పాడు. వ్యవసాయం, వాతావరణం, డాటాసైన్స్, కృత్రిమ మేధ ఇలా అన్ని విభాగాలు ఏకతాటిపైకి వచ్చినప్పుడు అభివృద్ధి సాధ్యమని అందుకే అన్ని అంశాలు అందుబాటులో ఉండే విద్యావిధానానికి భవిష్యత్తు ఉందని తెలిపారు.

ఈకార్యక్రమంలో డాక్టర్ జహాగీర్దార్, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం రాజు, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ జి.బి రెడ్డి, సయ్యద్ అర్స్లాన్ అలీ,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, యూజిసి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ జి. మల్లేశం, మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ తిరుపతి రావు, ప్రొఫెసర్ పి.వి రావు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News