Friday, May 3, 2024

భారత రక్షణ రంగానికి మరో మిస్సైల్

- Advertisement -
- Advertisement -

India successfully tests VLS Range Surface to Air Missile

విఎల్ ఎస్‌సామ్ పరీక్ష విజయవంతం

బాలాసోర్ : భారతదేశం మంగళవారం వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ( విఎల్ ఎస్‌సామ్)ను ఒడిషాలోని బాలాసోర్ పరీక్షా కేంద్రం (ఐటిఆర్) నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఒడిషా తీరానికి దూరంగా చాందీపూర్ వద్ద ఈ ప్రయోగం జరిగింది. భారత రక్షణ పరిశోధనా సంస్థ డిఆర్‌డిఒ, భారత నావికాదళం సంయుక్తంగా ఈపరీక్ష చేపట్టాయి. భారత నౌక నుంచి దీనిని ఎంచుకున్న ఓ మానవరహిత అతివేగపు ఏరియల్ టార్గెట్‌పైకి ప్రయోగించి ఫలితాన్ని విశ్లేషించారు. ఈ ప్రయోగాన్ని డిఆర్‌డిఒకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు నిపుణులు పర్యవేక్షించారు. హైదరాబాద్‌లోని ఆర్‌సిఐ , పుణేలోని ఆర్ అండ్ డి ఇంజనీర్స్ నిపుణులు ప్రయోగాన్ని క్షుణ్ణంగా నిర్వహించారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రయోగాన్ని విజయవంతం చేసిన బృందాన్ని డిఆర్‌డిఒ ఛైర్మన్ , డిఫెన్స్ ఆర్ అండ్ డి విభాగం సెక్రెటరీ జి సతీష్ రెడ్డి అభినందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News