న్యూఢిల్లీ : రాబోయే ఎనిమిది నుంచి పది వా రాల్లో అమెరికాతో సుంకాల సమస్యకు పరిష్కారం పొందే అవకాశముందని ప్రధాన ఆర్థి క సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా నుంచి చమురు ను కొనుగోలు చేస్తున్నందుకు గాను భారతదే శం నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అ మెరికా అదనంగా 25 శాతం సుంకం విధించింది. దీంతో భారత్‌పై సుంకం 50 శాతానికి పెరగ్గా, ఇది ఆగస్టులో అమల్లోకి వచ్చింది. భారత్ అమెరికాకు దాదాపు 85 బిలియన్ డా లర్ల మేరకు ఎగుమతులు చేస్తోంది. ఈ సుం కాల వల్ల అమెరికాకు భారత్ ఎగుమతులు క్షీ ణిస్తాయని ఆయన అన్నారు. గురువారం భా రత్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సమావేశంలో నాగేశ్వరన్ మాట్లాడుతూ, భారత్, అమెరికా దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఇవి పరిష్కారం దిశగా పురోగతి సాధిస్తున్నాయని అన్నారు. నా అంచనా ప్రకారం, భారత్ వస్తువులపై అమెరికా విధిస్తున్న టారిఫ్‌లపై పరిష్కారం వచ్చే 8 నుంచి 10 వారాల్లో చూసే అవకాశముంది అని ఆయన అన్నారు.
అమెరికా ప్రతిస్పందన సుంకాలు కూడా 10-15% స్థాయికి తగ్గవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరిత పరిష్కారం భారత్-అమెరికా ఆర్థిక సంబంధాలకు ఊరట కలిగించనుందని అన్నారు. ఆర్థిక వృద్ధి గురించి ఆయన మాట్లాడుతూ, భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వాస్తవ జిడిపి వృద్ధి 7.8 శాతం సాధించింది. కోవిడ్ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ అనేక దేశాల కంటే వేగంగా ఎదిగింది అని అన్నారు. రాబోయే రెండు సంవత్సరాల్లో తయారీ, సేవలు, వ్యవసాయ రంగాలు ఆర్థికాభివృద్ధికి ప్రధానంగా దోహదపడతాయన్నారు. వృద్ధి స్థిరంగా కొనసాగడంలో వినియోగం, పెట్టుబడులు దోహదం చేస్తాయి. భారత రుణ- జిడిపి నిష్పత్తి మెరుగ్గా ఉందని, ప్రతి డాలరు రుణానికి తగిన జిడిపి వృద్ధి సాధిస్తున్నామని ఆయన అన్నారు. గ్రామీణ డిమాండ్ బలంగా ఉండగా, పట్టణ డిమాండ్ కూడా పెరుగుతోందని వివరించారు. జిఎస్టి రేట్లలో తాజా సడలింపులు వినియోగదారుల చేతిలో అదనపు ఆదాయాన్ని అందజేస్తాయని, పట్టణ వినియోగం మరింతగా పెరుగుతుందని అన్నారు. ఎంఎస్ఎంఇ రంగానికి రుణాలు పెరుగుతున్నాయి. పెద్ద పరిశ్రమల రుణాల్లో నిర్మాణాత్మక మార్పులు వస్తున్నాయని, వనరుల సమీకరణకు తగిన మార్గాలు లభ్యమవుతున్నాయని నాగేశ్వరన్ తెలిపారు.
మెరుగ్గా విదేశీ మారక నిల్వలు
విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఆరోగ్యకరంగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుత కరెంట్ ఖాతా లోటు జిడిపిలో 0.2 శాతానికి తగ్గిందని తెలిపారు. రూపాయి ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే బలహీనంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో రూపాయి విలువ పటిష్టమవుతుందని, మరింత బలపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించే పథకాలు, డీ-రెగ్యులేషన్ ప్రధాన అంశాలని చెప్పారు. పోర్టులు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాల పెరుగుదల వృద్ధి వేగంగా జరిగితే ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తలెత్తదని వివరించారు. చైనాతో వాణిజ్యం విషయంలో, భారతదేశం ప్రధానంగా క్యాపిటల్, మధ్యస్థాయి వస్తువులను దిగుమతి చేసుకుంటోందవన్నారు. ప్రైవేట్ రంగం ఇన్నోవేషన్, ఆర్ అండ్ డిలో మరింత ఖర్చు పెట్టాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఇప్పటివరకు తక్కువగానే ఉందని, ముఖ్యంగా కోడింగ్ ఉద్యోగాలపై ముప్పు ఉండవచ్చని, కానీ ఉపాధి పరంగా పెద్ద సమస్య కాదని అన్నారు. ఉద్యోగులు నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
Also Read: మేడారం జాతర మాస్టర్ ప్లాన్ సిద్దం