Monday, May 13, 2024

పోలాండ్‌లో భారతీయునికి జాతివిద్వేష పరాభవం..

- Advertisement -
- Advertisement -

Indian faces racially abused in Poland

పోలాండ్‌లో భారతీయునికి జాతివిద్వేష పరాభవం
పరాన్నజీవీ!… మీ దేశానికి వెళ్లిపో? అని దూషించిన అమెరికన్

లండన్: పోలాండ్‌లో భారతీయునికి జాతివిద్వేష పరాభవం జరిగింది. ఒక అమెరికా వాసి భారతీయుడ్ని చూసి “పారసైట్ ”(పరాన్నజీవి), ఆక్రమణదారునిగా దూషిస్తూ “మీ దేశానికి వెళ్లిపో” అని నోటిదురుసుతో బెదిరించాడు. ఈ విద్వేషాన్ని ఎదుర్కొన్న భారతీయుని వివరాలు తెలియరావడం లేదు. కానీ ఇది వీడియో ద్వారా చిత్రీకరణ జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏ నగరంలో ఈ వీడియో చిత్రీకరణ జరిగిందో కూడా తెలీదు. ట్విటర్ వినియోగదారులు ఈ వీడియోను విమర్శలతో వార్షా పోలీసులకు పంపారు. ఒక మాల్ సమీపాన భారతీయుడు నడుస్తుండగా, ఈ సంఘటన ఎదురుకావడంతో రికార్డింగ్‌ను ఆపమని కోరినా ఆ అమెరికన్ పట్టించుకోకుండా ద్వేషించడం కొనసాగించాడు. నీవెందుకు ఐరోపాలో ఉన్నావు? “ నేను అమెరికాలో ఉన్నాను. అక్కడ నుంచే వచ్చాను. మీ లాంటి వాళ్లు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఎందుకు పోలాండ్‌లో ఉంటున్నారు? పోలాండ్‌ను కూడా ఆక్రమించుకుందామనా? మీ దేశానికి ఎందుకు తిరిగి వెళ్లరు? అని అవతలి వ్యక్తి భారతీయుడ్ని పదేపదే ప్రశ్నలతో వేధించాడు. మీవారంతా ఎందుకు మా దేశాల్ని ఆక్రమిస్తారు ?మీకు భారత దేశం ఉంది కదా.. మా పనులన్నీ కొల్లగొట్టడానికి తెల్లవారి దేశానికి ఎందుకు వస్తారు? స్వంతంగా మీ దేశాన్ని ఎందుకు నిర్మించుకోరు? ఎందుకు మాపై పారసైట్(పరాన్నజీవి) అవుతారు? మా జాతిని మారణహోమం చేస్తున్నారు! నీవొక ఆక్రమణదారుడివి.. ఇంటికిపో.. ఐరోపాలో మీరుండడం మాకిష్టం లేదు. పోలాండ్ కేవలం పోలిష్ జాతివారికే.. నీవు పోలిష్ జాతివాడివి కావు.. అని ఆ అమెరికన్ నిలదీశాడు. తాజాగా ఈ సంఘటన ఎందుకు జరిగిందో…వారిద్దరి మధ్య వాగ్వాదానికి ఏది దారి తీసిందో తెలియడం లేదు. ఇది జాత్యహంకారాన్ని రుజువు చేసే అవమానకరమైన సంఘటనగా సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే వారం రోజుల క్రితం అమెరికాలోని టెక్సాస్ లో జరిగింది. మెక్సికన్ యువతి ఇదే విధంగా భారతీయ అమెరికన్ మహిళలను కొందరిని బెదిరించింది.

Indian faces racially abused in Poland

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News