పట్నా : ప్రధాని మోడీ అహంకారం కారణంగా భారత విదేశాంగ విధానం కుప్పకూలిందని, దేశం దౌత్యపరంగా ఏకాకి అయిందని, కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను కాపాడడంలో ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)సమావేశంలో ఆమోదించిన రాజకీయ తీర్మానంలో ఈ విమర్శలను చేసింది. అదేవిధంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సరవణ (సర్) ప్ర క్రియ ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చే సింది. ఈ సమావేశంలో మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శులు కెసి వేణుగోపాల్, జైరాం రమేశ్, సచిన్ పైలెట్, పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ , బీహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ కుమార్ ఇతరులు పాల్గొన్నారు. భారత విదేశాంగవిధానం కుప్పకూలడం పట్ల తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సీడబ్ల్యూసీ తీర్మానంలో పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ప్రభుత్వాలు విదేశాంగ వి ధానంలో వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వ చ్చాయని తీర్మానం పేర్కొంది.
ప్రస్తుత మోడీ ప్రభుత్వం అమెరికా కు వ్యతిరేకంగా చైనా వైపు మొగ్గుచూపేందుకు అనుసరిస్తున్న బుద్ధితక్కువ ఊగిసలాటవల్ల భారత విదేశాంగ విధానం స్వతంత్ర ప్రతిపత్తికి భంగం వాటిల్లుతోందని, ఆయా ప్రభుత్వాల కృషి బూడిదపాలవుతోందని తీర్మానంలో పేర్కొన్నారు. వాణిజ్యం విషయంలో తన హెచ్చరికలవల్లనే భారతదేశం ఆపరేషన్ సిందూర్ నిలిపివేసిందని అమెరికా ప్రెసిడెంట్ పదే పదే చెబుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ విషయంలో మోడీ సర్కార్ నిజాయతీగా వ్యవహరించేందుకు నిరాకరిస్తోందని కాంగ్రెస్ పేర్కొంది. భారత ప్రభుత్వం బేరసారాలు సాగిస్తున్నా ట్రంప్ భారత ఎగుమతులపై అధికసుంకాలను ప్రకటించాడని, దీనివల్ల భారతీయ కీలక పరిశ్రమలపై పె ద్ద దెబ్బ తగిలిందని సీడబ్ల్యూసీ తీర్మానం పేర్కొంది. అ మెరికా ప్రభుత్వం వందలాది మంది భారతీయులను అవమానించినా, వారి చేతులకు బేడీలు వేసి సైనిక విమానంలో అతి దారుణంగా భారతదేశానికి పంపినా మోడీ సర్కార్ పల్లెత్తు మాట అనలేదని, నిరసన తెలుపలేదని కాంగ్రెస్ దుయ్యబట్టింది.
గతంలో ట్రంప్ భారతీయులను నియమించుకోవద్దని మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అమెరికా సంస్థలను కోరిన విషయాన్ని ప్రస్తావించింది. ఇప్పుడు ట్రంప్ హెచ్ -1బి వీసా విధానంలో పెను మార్పులవల్ల అమెరికా లోని లక్షలాది మంది భారతీయ పౌరుల భవిష్యత్ ప్రమాదంలో పడిందని సీ డబ్ల్యూ సీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంక్షోభాల ని వారణకు చైనా వైపు మొగ్గుచూపే ప్రభుత్వ ప్రయత్నం అత్యంత దారుణమైనదని కాంగ్రెస్ తీర్మానం పేర్కొం ది. భారతదేశ ప్రాదేశిక సమగ్రత, జాతీయ భద్రతకు చైనా పెద్దముప్పును కలిగిస్తుందని కాంగ్రెస్ హెచ్చరించింది. చైనా భారతీయ భూభాగాలను అక్రమించడం, కీలక గస్తీ కేంద్రాలు ఏర్పాటు చేయడాన్ని సర్కార్ నిరాకరిస్తున్నా, అనదికార వర్గాలు ధృవీకరిస్తున్న అంశాన్ని సిడబ్ల్యూసీ ప్రస్తావించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు చైనా అధికారులు ఇచ్చిన మద్ద తు, ఆయుధ సహాయం విషయాన్ని గుర్తు చేస్తూ, ఇది మన భూభాగాన్ని చుట్టుముట్టే ముప్పు గా పరిణమించగలదని హెచ్చరించింది.
ఆర్థికంగా చైనా దిగుమతులు ఇమ్మడి ముమ్మడిగా పెరిగిపోయాయని, ఇది వాణిజ్యాన్ని ఆయుధంగా వాడుకునే చైనాపై భారతదేశం ప్రమాదకరంగా ఆధారపడేలా చేసిందని సిడబ్ల్యూసీ విమర్శించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన అధ్యక్షోపన్యాసంలో రానున్న బీహార్ ఎన్నికలు మోడీ అవినీతి సర్కార్ పతనానికి నాంది కాగలవని పేర్కొన్నారు. డిబ్ల్యూసీ వేదికగా ఖర్గే బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ను బీజేపీ మానసికంగా రిటైర్ చేసిందని, ఆ యనను అనవసర భారంగా భావిస్తోందని ఎద్దేవా చే శారు. ఓట్ల చోరీ, ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, స్వతంత్ర ప్రతిపత్తిగల రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం పరచడం వంటి పలు అంశాలపై బీజేపీని ఖర్గే తీవ్రంగా దుయ్యబట్టారు. అమెరాకా ప్రెసిడెంట్ డోనా ల్ట్ ట్రంప్ ఇటీవల ప్రకటనలు, భారతదేశానికి ఇబ్బంది కరంగా తీసుకుంటున్న చర్యలను కూడా స్పష్టం చేశా రు.
ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. మోడీదౌత్య వైఫల్యం ఫలితంగానే అంతర్జాతీయ స్థాయిలో మన సమస్యలు ఎదుర్కొంటోందని విమర్శించారు. మోడీ నా స్నేహితులు అని చెప్పుకునే వారే, అనేక ఇబ్బందుల్లో నెడుతున్నారని ఖర్గే విమర్శించారు. ఓటు చోరీ , ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ అంశంపై బీజేపీని, ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. ఓటర్ల జాబితాను అధికారికంగా తారుమారు చేస్తున్నప్పుడు బీహార్ లో విసృ్తత స్థాయిలో సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించడం, దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, కాంగ్రెస్ చిత్తశుద్ధిని, ప్రతిజ్ఞతను పునరుద్ఘాటించడం అవసరమని ఖర్గే అన్నారు. ఓట్లచోరీ అంశా న్ని లేవనెత్తిన తర్వాతే ఎన్నికల కమిషన్ ఓట్లదొంగతనం పై నిఘా పెట్టిందని రాహుల్ గాంధీ ఆరోపించా రు. అలంద్ లో ఓట్ల తొలగింపు పై కర్ణాటక సిఐడీకి అ ధారాలు అందిస్తారని ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను ప్రశ్నించారు.
ఓటర్ల జాబితా లో పేర్లు చేర్పు, లేదా తొలగింపు కోసం ఆధార్ ఆధారిత ధృవీకరణకు అవసరమయ్యే కొత్త ఈ వేరిఫికేషన్ ఫీచర్ ను ఈ సీ ప్రవేశ పెట్టిన విషయాన్ని రాహుల్ ప్ర స్తావించారు. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో అనేక ఓట్లను రద్దుచేయాలని రాహుల్ గాంధీ గతంలో డిమాండ్ చేశారు. రాష్ట్ర సిఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాతే ఓట్ల దొంగతనంపై దర్యాప్తు చేస్తున్నది.
Also Read: బిసి రిజర్వేషన్లపై పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు