Thursday, May 2, 2024

అబ్బురంగా వజ్రోత్సవాలు

- Advertisement -
- Advertisement -

లోగో ఆవిష్కరించిన కెకె

మన తెలంగాణ/హైదరాబాద్: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలలో భాగంగా రాష్ట్రమంతటా ఏకకాలం లో జాతీయ గీతాలాపన ఉంటుందని ఉత్సవాల కమిటీ చైర్మ న్, ఎంపీ కె కేశవరావు వెల్లడించారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన లోగోను రవీంద్రభారతితో బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెకె మాట్లాడుతూ, ద్విసప్తాహ వే డుకల లోగోను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ధర్మాన్ని సూచిస్తున్న ధర్మచక్రం జాతీయ పతాకంలో ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటా స్వాతంత్య్ర వజ్రోత్స వే డుకలు అత్యంత ఘనంగా జరుపుకోవాలని అభిలాషించారు. అలాగే ప్రధానమైన అన్ని నగరాల్లో 2కె రన్ నిర్వహిస్తామన్నా రు. ఈ నేపథ్యంలో స్వతంత్ర భారత వ్రజోత్సవ వేడుకల్లో అందరూ పాల్గొనాలన్నారు. నాడు ఆంగ్లేయులు పూర్వీకుల ను ఎంతో బాధపెట్టారని, మన త్యాగధనులను స్మరించుకునేందుకే వజ్రోత్సవాలని కెకె అన్నారు. ఈ కార్యక్రమం ఎవరికీ పోటీ కాదని అందరినీ ఉద్దేశించిందన్నారు. అందువల్ల రాజకీయాలకు, వర్గాలకు, మతాలకు అతీతంగా అందరు భా గస్వాములు కావాలన్నారు. ఈ నేపథ్యంలోఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కెకె పేర్కొన్నారు.

అన్ని థియేటర్లలో మహాత్మగాంధీ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు తెలిపారు. 15రోజుల పాటు రాష్ట్రమంతటా చారిత్రక ప్రదేశాలల్లో విద్యుద్దీప అలంకరణలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రవీంద్రభారతీలో సాంస్కృతిక కార్యక్రమాలు ఫ్రీడమ్ పోటీ లు రెహమాన్, ఏసుదాసుతో మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నట్లు కెకె వెల్లడించారు. ఈ నెల 15వ తేదీని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై తిరంగ జెండా ఎగిరే విధంగా కోటి ఇరవై లక్షల జాతీయ జెండాల పంపిణీ జరుగనున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 8న ఉత్సవాలు ప్రారంభమై 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల వల్ల రాష్ట్రమంతటా చారిత్రక ప్రదేశాలకు విద్యుద్ధీపాలంకరణతో స్వాతంత్య్రోత్స స్ఫూర్తి…. డిస్ ప్లే చేస్తామన్నారు. ఈ ఉత్సవాల సంజర్భంగా స్వతంత్య్ర సమరయోధులకు పెద్దఎత్తున సత్కారం చేస్తున్నామన్నారు. 75 మంది కళాకారులతో 75 ముఖ్యమైన సంఘటనలపై చిత్ర ప్రదర్శన ఉంటుందననారు. అలాగే ఈ నెల 21న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశంలో దేశాభివృద్ధిపై ప్రత్యేక తీర్మానం చేస్తామన్నారు. వరంగల్ జైలును ఓపెన్ జైలుగా చేయాలని ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News