Wednesday, April 24, 2024

నెట్‌ జీరో వాటర్‌ పై మెమరాండంను సమర్పించనున్న ఇండియన్‌ ప్లంబింగ్‌ అసోసియేషన్‌..

- Advertisement -
- Advertisement -

బెంళూరు: ఇండియన్‌ ప్లంబింగ్‌ అసోసియేషన్‌ (ఐపీఏ), భారతదేశపు అతిపెద్ద నీరు, పారిశుద్ధ్యం మరియు ప్లంబింగ్‌ ఎగ్జిబిషన్‌, ప్లంబెక్స్‌ ఇండియా 2023 ను ఏప్రిల్‌ 27–29, 2023 వరకూ బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ వద్ద నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నీరు, పారిశుద్ధ్య, ప్లంబింగ్‌ ఉత్పత్తులలో తాజా ఆవిష్కరణలను, విప్లవాత్మక సాంకేతికత, వినూత్నమైన పరిష్కారాలు, అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులను, మరీ ముఖ్యంగా నీటి పొదుపుకు తోడ్పడే ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. దాదాపు 10వేల మంది వ్యాపార, వాణిజ్య సందర్శకులు ఈ పరిశ్రమల నుంచి పాల్గొంటారని అంచనా. ప్లంబెక్స్‌ ఇండియాకు కేంద్ర గృహ, నగర వ్యవహారాల మంత్రిత్వ శాఖలతో పాటుగా జల్‌ శక్తి మంత్రిత్వ శాఖలు కూడా మద్దతు అందిస్తున్నాయి.

ప్లంబెక్స్‌ ఇండియా ప్రదర్శనలో విస్తృత శ్రేణిలో పైప్‌లు, పైప్‌ ఫిట్టింగ్‌లు, వాటర్‌ హీటర్స్‌, పంపులు, వాల్వ్స్‌ మరియు మరెన్నో ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో పలు సమాచార యుక్త సదస్సులు, ప్యానెల్‌ చర్చా కార్యక్రమాలు కూడా ఉంటాయి. భారత్‌ ట్యాప్‌– యాన్‌ ఇనీషియేటివ్‌ అనే అంశంపై ఇవి జరుగుతాయి.

ఇండియన్‌ ప్లంబింగ్‌ అసోసియేషన్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌, గుర్మీత్‌ సింగ్‌ అరోరా మాట్లాడుతూ ‘‘భారతదేశంలో ప్రపంచజనాభాలో 17.7% మంది ఉన్నారు. కానీ 4% మాత్రమే తాజా నీటి వనరులు ఉన్నాయి. అంతేకాదు భూగర్భ జలాలను అధికంగా వాడే దేశం కూడా మనది. అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్లంబెక్స్‌ ఇండియా తరపున తాము కూడా ఆ దిశగా పలు ప్రయత్నాలు చేస్తున్నాము. నిర్మాణ ప్రాంగణాలలో నెట్‌ జీరో వాటర్‌పై ఓ మెమరాండంను పలు మంత్రిత్వశాఖలకు సమర్పించనున్నాము. దీనిలో వాటర్‌ మీటరింగ్‌, ఇంకుడు గుంతలు వంటి అంశాలు కూడా ఉంటాయి’’అని అన్నారు.

ప్లంబెక్స్‌ ఇండియా –ద్వారా బిల్డింగ్‌ , ప్లంబింగ్‌ రంగాల ప్రముఖులను ఒకేదరికి తీసుకురాబోతున్నామని ఐపీఏ నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌ గుప్తా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News