Sunday, August 10, 2025

అత్యున్నత స్థాయికి భారత రక్షణ ఉత్పత్తులు: రాజ్‌నాథ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత వార్షిక రక్షణ ఉత్పత్తి సర్వకాల అత్యున్నత స్థాయికి చేరుకుందని, ఇది 2024-25లో రూ. 1,50,590 కోట్లని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 1.27 లక్షల కోట్ల ఉత్పత్తి కన్నా ఈసారి 18 శాతం వృద్ధి నమోదయింది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరుకుందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రక్షణమంత్రి ‘సమిష్టి ప్రయత్నాలను’ ప్రశంసించారు. రక్షణ ఉత్పత్తి శాఖ, రక్షణ ప్రభుత్వ రంగ విభాగాలు, ప్రైవేట్ పరిశ్రమలు సహా అన్ని రకాల వాటాదారులు సమిష్టిగా ఈ మైలు రాయిని సాధించారన్నారు. ‘ఈ ఆరోహణ పథం భారత రక్షణ పరిశ్రమ బలపడుతున్నది అనడానికి స్పష్టమైన సూచిక’ అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News